జిమ్ లో కసరత్తులు చేస్తున్న మెగాస్టార్

329
chiru-gym

మెగాస్టార్ చిరంజీవి ఇటివలే సైరా సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. కాగా చిరంజీవి తర్వాతి చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల దర్శకత్వంలో చేయనున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల. దేవాల‌యాల‌కి సంబంధించిన నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌.

అయితే ఈ మూవీ కోసం బ‌రువు తగ్గేందుకు చిరు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిరు జిమ్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే ప్రస్తుతం చిరంజీవి అమెరికాలో ఉన్నాడని ఇది పాత ఫోటో అని కొంత మంది చెబుతున్నారు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈమూవీలో హీరోయిన్ గా త్రిష తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇందుకు నయనతార కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ఈచిత్రాన్ని రామ్ చరణ్ , నిరంజన్‌ రెడ్డి నిర్మించనున్నారు.