ఇవాళ ఇంటర్ నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా పలు సెలబ్రెటీలు వాళ్ల నాన్నలతో ఉన్న అనుబంధాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి వాళ్ల నాన్నతో ఉన్న అనుబంధాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈనేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. చిరు తండ్రి వెంకట్రావు రామ్ చరణ్ ను ఎత్తుకున్న ఫోటోను పెట్టారు. చిరుత విత్ మై ఛార్మింగ్ డాడ్. మా నాన్న నవ్వు…నా బిడ్డ చిరునవ్వు.. ఈ రెండు నాకు చాలా ఇష్టం హ్యాపీ ఫాదర్స్ డే’’ అని మెసేజ్ పోస్ట్ చేశారు.
ఈసందర్భంగా రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటో చూసిన మెగా అభిమానులు సంబురపడిపోతున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తండ్రి కృష్ణకు ఫాదర్స్ డే శుభాకాంక్షాలు తెలిపారు.దృఢమైన, దయ, ప్రేమ, సున్నితమైన,శ్రద్ధ ఇలాంటి కొన్ని పదాలతో నా తండ్రితో నాకున్న రిలేషన్‌ని తెలియజేస్తుంది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నాన్న. నాన్నలా నేను నా పిల్లల దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని మహేశ్ పోస్ట్ చేశారు.