న‌ల్గొండ‌లో ఘ‌నంగా జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్ధంతి వేడుక‌లు

567

తెలంగాణ సిద్దాంత క‌ర్త‌, ప్రొఫెస‌ర్ ఆచార్య జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్దంతి నేడు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు నాయ‌కులు, ఉద్య‌మ‌కారులు జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఇక న‌ల్ల‌గొండ‌లో ఆచార్య ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌‌ర్ సాయ‌ర్ వ‌ర్ధంతిని నిర్వ‌హించారు. జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు జెడ్పీ చైర్మ‌న్ బండ న‌రేంద‌ర్ రెడ్డి, న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి.

ఈ సంద‌ర్భంగా జ‌య‌శంక‌ర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స‌మాజం జ‌య‌శంక‌ర్ సార్ ను ఎన్న‌టికి మ‌రువ‌బోద‌ని అన్నా రు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రముఖ న్యాయవాది గుండె వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, జాగృతి జిల్లా కన్వీనర్ దేవేందర్,మున్సిపల్ కౌన్సిలర్ లు ఇతర నాయకులు పాల్గోన్నారు.