సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు..

41

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా టికెట్‌ ధరల విషయంలో తెలంగాణ ప్రభూత్వం చిత్ర పరిశ్రమ ఇబ్బందులను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించింది. ఈమేరకు నిన్న టికెట్‌ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’ అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే, పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.