స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధరాంగా సైరా మూవీ తెరెకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి నరసింహరెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో ఈమూవీని నిర్మిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటివరకూ ఈ చిత్రం 40 శాతం వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈసినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఇక వచ్చే వేసవి లో ఈమూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోన్నారు చిత్రబృందం. తాజాగా షూటింగ్ జరగుతోన్న ఈసినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రస్తతం హైదరాబాద్ భారీ సెట్లో ఈసినిమా షూటింగ్ నిర్వహిస్తోన్నారు. మొత్తం సినిమాలో ఈసీన్ హైలెట్ గా నిలవనుందని సమాచారం. చిత్రానికి సంబంధించిన భారీ ఫైట్స్ సీన్స్ ను చీత్రికరిస్తోన్నారు. ఈ సెట్ ఖర్చు రూ.40 కోట్లు ఉంటుందని సమచారం. ప్రత్యర్దులపై నరసింహారెడ్డి ఏవిధంగా పోరాడాడు అనే కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈఫైట్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ను రప్పించారు.