మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఎంట్రీ క‌న్పామ్ ..

330
chiranjeevi, vaishav tej

మెగా ఫ్యామీలి నుంచి దాదాపు అర‌డ‌జ‌ను మంది హీరోలు ఉన్న విష‌యం తెలిసిందే. ఎంత మంది హీరోలు వ‌చ్చినా త‌మ కంటూ ప్ర‌త్యేకమైన స్టైల్ ను ఏర్ప‌రచుకున్నారు. ఇటివ‌లే చిరు చిన్న కూత‌రు భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. విజేత సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. త్వ‌ర‌లోనే ఈసినిమాను విడుద‌ల చేయ‌నున‌న్నారు చిత్ర‌యూనిట్. చిరంజీవి మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ సాయి ధ‌ర‌మ్ తేజ్  త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

vaishnav tej

అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ను సొంతం చేసుకున్నాడు. చిరంజీవి పోలిక‌ల‌తో ఉండి.. ఆయ‌న హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేస్తూ చాలా మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. తాజాగా తేజ్ న‌టించిన తేజ్ ఐల‌వ్ యూ చిత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. పూర్తిగా ల‌వ్ జోన‌ర్ లో సాగే ఈసినిమాకు క‌రుణాక‌రణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. అందుకోసం ఇత‌ర మెగా హీరోల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటున్నాడని స‌మాచారం.

sai dharam tej
ఇటివ‌లే చ‌దువులు పూర్తి చేసి న‌ట‌న వైపు రావాల‌ని ఆస‌క్తిగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. న‌ట‌న‌, డ్యాస్స్ కు సంబంధించిన శిక్ష‌ణ కూడా తీసుకుంటున్నాడు వైష్ణ‌వ్ తేజ్. ఇక ఇటివ‌లే ద‌ర్శ‌కుడు కె. సాగ‌ర్ చంద్ర ఓ స్టోరీ ని వైష్ణ‌వ్ తేజ్ కు వినిపించాడు. ఆస్టోరీ అత‌నికి న‌చ్చడంతో వెంట‌నే ఓకే చెప్పేశాడ‌ట‌. ఇక ఈసినిమాకు రామ్ త‌ళ్ళూరి నిర్మించ‌నున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టి వ‌చ్చిన వారిలో త‌మ కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ను సంపాదించుకున్నారు. ఇక రాబోయే వైష్ణ‌వ్ తేజ్ ఏ మేరకు ప్రేక్ష‌కుల నుంచి మ‌న్న‌న‌లు పొందుతాడో చూడాలి.