చిరంజీవి “సైరా” విడుదల తేదీ ఖరారు..

315
syera
- Advertisement -

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈమూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి, కన్నడ హీరో సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతారా,తమన్నాలు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఇక సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఈనేపధ్యంలో తాజాగా ఈచిత్ర విడుదలపై కీలక ప్రకటన చేసింది చిత్ర యూనిట్. అక్టోబరు 2నే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, చిరంజీవి డబ్బింగ్‌ చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలిపింది. ఈ చిత్రానికి అమిత్‌ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -