మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న ‘భోళా శంకర్’ రిలీజ్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రానుంది. మెగాస్టార్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ ను 2024 జనవరి 12కి ఫిక్స్ చేశారని టాక్. ఐతే, ఇప్పటికే బడా చిత్రాలన్ని వచ్చే సంక్రాంతికి టార్గెట్ గా తమ విడుదల తేదీల పై ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ కూడా తన ‘భోళా శంకర్’ను సంక్రాంతికే టార్గెట్ చేశాడు.
చిరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది. తన ‘వాల్తేరు వీరయ్య’ కేవలం సంక్రాంతికి రావడం వల్లే అంత పెద్ద విజయాన్ని సాధించింది. అందుకే.. మెహర్ రమేష్ తో తానూ చేస్తున్న ‘భోళా శంకర్’ సినిమాని కూడా వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకే మెగాస్టార్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. సినిమాలోనే ఈ షేడ్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ రెండు మాస్ ట్రాక్ లు యాడ్ చేశారు. మాస్ ఎలివేషన్లను మెహర్ రమేష్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. పైగా మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ తో ఈ ‘భోళా శంకర్’ రాబోతున్నాడు. మరి ఈ ‘భోళా శంకర్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఐతే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి..