దర్శకుల సంఘానికి పలువురు భారీ విరాళం..

159
chiru-guest

దర్శక రత్న దాసరి నారాయణ రావు జయంతి రోజు డైరెక్టర్స్ డే గా ప్రకటించిన విషయం తెలిసిందే. మే4వ తేదిన ఆయన జన్మదినం సందర్భంగా నిన్న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి పలువురు సీని ప్రముఖులు, మెగాస్టార్ చిరంజీవి, కొంత మంది దర్శకులు హాజరయ్యారు. చిరంజీవి దాస‌రితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. లంకేశ్వరుడు సినిమాతో తనకు దాసరితో పరిచయం అయిందన్నారు.

ఆయనతో కలిసి చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ ఇద్దరి మధ్య దగ్గరి బంధుత్వం ఉందన్నారు . దాసని తనుకు వరుసకు తాత అవుతారని..ఈవిషయం కొద్ది మందికి మాత్రమే తెలుసన్నారు. ద‌ర్శ‌కుల సంఘానికి త‌న వంతు సాయంగా రూ. 25 లక్షల రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు. దర్శక ధీరుడు రాజమౌళి రూ.50లక్షలు సాయం ఇవ్వగా, రాఘవేంద్రరావు రూ.25లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.