ఎట్టకేలకూ మెగాస్టార్ చిరంజీవికు చాలా సంవత్సరాల తర్వాత వాల్తేరు వీరయ్య రూపంలో చెప్పుకోదగిన కమర్షియల్ హిట్ దక్కినట్టుగానే ఉంది. వాల్తేరు వీరయ్య సినిమాకు నాన్ వీకెండ్ లో టికెట్లు బాగానే పోతున్నాయి. ముందస్తు బుకింగ్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రద్దీ కనిపిస్తూ ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో ఒక్క వాల్తేరు వీరయ్యకు మాత్రమే ఈ డిమాండ్ ఉండటం గమనార్హం. పాజిటివ్ బజ్, మెగాస్టార్ తో పాటు రవితేజ, శ్రుతి హాసన్ వంటి ఎక్స్ ట్రా అట్రాక్షన్లుగా నిలవడం వాల్తేరు వీరయ్య కు పెద్ద ప్లస్ అయ్యింది.
చిరు రీఎంట్రీ నుంచి గమనించినా.. ఖైదీ 150 ఫర్వాలేదు. ఫ్యాన్స్ వరకూ నచ్చుతుంది. ఆ తర్వాత వచ్చిన సైరా కూడా ఆకట్టుకుంది, కాకపోతే కమర్షియల్ గా ప్లాప్. సీన్లు సీన్లుగా చూస్తే గాడ్ ఫాదర్ బాగానే ఉంటుంది కానీ, మొత్తంగా చూస్తే మాత్రం సో..సో.. నే. ఇక ఆచార్య డిజాస్టర్. జనాలను థియేటర్లకు క్యూ కట్టించలేకపోయింది. ఇలాంటి తరుణంలో .. సుదీర్ఘ సమయం మేకింగ్ తోనే విడుదల అయిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది.
పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య మొత్తానికి ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్ నుంచినే కాక సగటు ప్రేక్షకుడి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమాపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. పోటీగా పెద్ద సినిమాలు ఉన్నా.. అవి బాగాలేకపోవడం కూడా మెగాస్టార్ సినిమాకు తెలుగునాట కలెక్షన్ల అవకాశాన్ని ఇస్తున్నట్టుంది. ఎట్టకేలకూ మెగాస్టార్ కి మెగా హిట్ వచ్చింది.
ఇవి కూడా చదవండి…