మంచు మనోజ్ పెళ్లి తేదీ అదే

58
- Advertisement -

మంచు ఫ్యామిలీలో ఫాలోయింగ్ ఉన్న హీరో మనోజ్. హీరోగా గ్యాప్ వచ్చినా.. మనోజ్ కి ఇప్పటికీ క్రేజ్ ఉంది. మంచి నటుడు, పైగా మంచి మనిషి అని ఇండస్ట్రీలో మనోజ్ కి గుడ్ నేమ్ ఉంది. అయితే, గత కొంత కాలంగా మనోజ్ రెండో పెళ్లి పై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎప్పుడైతే.. ఓ వినాయక మండపంలో భూమా మౌనికతో కలిసి మనోజ్ కనిపించాడో.. అప్పటి నుంచి పెద్ద ఎత్తున వీరి బంధం పై అనేక కథనాలు వచ్చాయి. మనోజ్ – మౌనిక పెళ్లి పై కూడా అనేక డిస్కషన్స్ షురూ అయ్యాయి. మధ్యలో మనోజ్ కూడా తమ బంధం పై క్లారిటీ ఇచ్చాడు.

అయితే, తాజాగా మనోజ్ ఓ పోస్ట్ తో తన పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. “కొంత కాలంగా, నేను ఈ స్పెషల్ వార్తను నా హృదయానికి దగ్గరగా ఉంచుతున్నాను. 20 జనవరి 2023న నా జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి” అని మనోజ్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ అర్థం పెళ్లి గురించే అని మనోజ్ సన్నిహితులు కూడా కన్ ఫర్మ్ చేశారు. మొత్తానికి మంచు మనోజ్ శుభ వార్త చెప్పాడు.

ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. మనోజ్ కి కాలం కరుణించలేదు. అన్నీ ఉన్నా.. స్టార్ కాలేకపోయాడు. నిజానికి మంచు మనోజ్ కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఓ దశలో రెండు మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఐతే, ఆ తర్వాత వరుస ప్లాప్ లు, దీనికితోడు కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే, మనోజ్ ఈ సారి తన గేమ్ ప్లాన్ మార్చాడట. రంగులు వేసుకుని తెర పై వేషాలు వేసే కంటే.. రాజకీయ తెర పై సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేయడమే బెటర్ అని మనోజ్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

తెలుగు ఖ్యాతికి ఘననివాళి

సంక్రాంతి విన్నర్ ఎవరంటే ?

ఫేడ్ అవుట్ నుంచి ఫుల్ ఫామ్ లోకి

- Advertisement -