బాబీ- చిరు మూవీ నుండి ‘మెగా వేవ్‌’.. పోస్టర్ వైరల్..

187
chiru
- Advertisement -

టాలీవుడ్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మేకర్స్‌. ‘మెగా వేవ్‌’ పేరుతో ఆదివారం సాయంత్రం 4.05గంటలకు అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది.

దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. నిలిపి ఉన్న ఓడకు యాంకర్‌ వేలాడుతూ దాని వెనుక చిరంజీవి రూపం ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చిరు బర్త్‌డే మోషన్‌ పోస్టర్‌ కూడా ట్రెండింగ్‌లో ఉంది.

మరోవైపు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫ‌ర్ రీమేక్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్ సాయంత్రం రానుంది. ఇక మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్‌గా రూపొందుతున్న మూవీకి సంబంధించి ఆదివారం ఉద‌యం 9గం.ల‌కు స‌ర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి మెగా అప్‌డేట్ కూడా చిరు బర్త్‌డే రోజు రానుంది. మొత్తానికి చిరు పుట్టిన రోజున అభిమానులు పండగ చేసుకోబోతున్నారు.

- Advertisement -