మొక్కలు నాటిన గెల్లు శ్రీనివాస్ యాదవ్..

111
Gellu Srinivas

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పుట్టినరోజు పురస్కరించుకుని నేడు హైదరాబాద్‌లో మొక్కలు నాటారు టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు,హుజురాబాద్ ఉప ఎన్నికల టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.