sdt15…మెగా మేనల్లుడు

124
- Advertisement -

గతేడాది హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జిపైన మెగస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ యాక్సిడెంట్‌ గురైన సంగతి తెలిసిందే. అయితే ఆ యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి బ్యాక్‌టూ కెమెరా అంటూ ట్వీటర్‌ ద్వారా తెలిపారు. తాజాగా sdt15 లోకేషన్‌లోకి వచ్చిన స్టిల్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అయింది. చాలా రోజుల తర్వాత ఓ బీటీఎస్ వీడియో రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్‌ sdt15 సినిమా షూటింగ్‌కు త్వరలో రాబోతున్నట్టు టాలీవుడ్‌లో సమాచారం.

sdt15 సినిమాను కార్తీక్‌దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి క‌న్నడ మ్యూజిక్ డైరెక్టర్ అంజ‌నీశ్ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు‌. కిరాక్ పార్టీ త‌ర్వాత అంజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న రెండో చిత్రమిది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఫీమేల్‌ లీడ్‌రోల్‌లో నటిస్తుంది. బ్రహ్మాజీ అజయ్ సునీల్ ఇతరులు ప్రధాన పాత్రలో నటించనున్నారు. అయితే గతేడాది తీసిన రిపబ్లిక్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్‌ అందుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి…

మీనా రెండో పెళ్లి.. నిజం ఏమిటంటే ?

పిక్ టాక్ : భారీ బ్యూటీ ఎరుపు అందాలు

దర్శకుడిగా మారిన కమెడియన్

- Advertisement -