సారంగి విద్వాంసుడ్ని ఆదుకున్న సోన్‌

229
- Advertisement -

ప్రముఖ హిందీ నటుడు సోన్‌సూద్ మరోసారి విశాలమైన ప్రేమను పంచుకున్నాడు. సినిమా రంగంలో విలన్‌గా కనిపించే సోన్‌ నిజజీవితంలో మాత్రం అజాతశత్రువుగా నిలుస్తున్నాడు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి నేను ఉన్నానంటూ అపన్నహస్తం ఇచ్చి ఆదుకున్నాడు. అయితే అక్కడితో ఆగిపోలేదు. సూద్ ఛారిటీ ఫౌండేషన్‌ స్థాపించి దేశ నలుమూలలకు తన సేవలను విసృత పరిచి అందర్నీ అదుకుంటున్నాడు.

హర్యానాకు చెందిన సారంగి వాయిద్యాకారుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ విద్వాంసుడు పరిస్థితిని చూసి చలించిన ఒక నెటిజన్‌ సోన్‌కు ట్వీట్‌ చేస్తూ ఆకళాకారుడికి సాయం చేయాలని వేడుకున్నాడు. దీనికి సోన్‌ సాయం చేస్తానని రీట్వీట్ చేస్తూ బదులిచ్చాడు. “ఖాన్ సాహిబ్, నేను ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా, ఆ తరువాత మీ సారంగి పాట వింటా” అంటూ బదులిచ్చాడు.

ఇవి కూడా చదవండి…

డిసెంబరులో పెళ్లిళ్ల సందడి….

యూట్యూబ్‌లో 17లక్షల కంటెంట్ తొలగింపు…

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిల్కిస్…

- Advertisement -