గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన గద్దలకొండ గణేశ్

601
Varun Tej
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు దేశ వ్యాప్తంగా అద్బుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే మూడు కోట్ల మైలు రాయిని దాటిన ఈగ్రీన్ ఛాలెంజ్ మరింతగా దూసుకుపోతుంది. పలువురు సినీ, రాజకీయ నాయకులు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఇటివలే ఎంపీ సంతోష్ కుమార్ మెగా హీరో వరుణ్ తేజ్ కు సవాల్ విసిరారు. తాజాగా ఈ సవాల్ ను స్వీకరించారు వరుణ్ తేజ్. తన నివాసంలో ఓ మొక్కను నాటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు సవాల్ విసిరినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు వరుణ్ తేజ్. ఆయన మరో ఇద్దరికి ఈసవాల్ ను విసిరారు. ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి, తమన్నాకు నామినెట్ చేశారు.

- Advertisement -