హుజుర్‌నగర్‌లో హోరెత్తిన ఎన్నికల ప్రచారం….

702
sathyavathi rathod
- Advertisement -

హుజుర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. మంత్రులు,ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలు చేస్తూ గ్రామాలను చుట్టివస్తూ ఓటర్లను కలుస్తున్నారు. తాజాగా ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

పాలకిడు మండలం శున్యపడు తండా, పలుగుతాండ, జాన్ పాడ్ లాల్లో టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఓటేయాలని ప్రజలను కోరారు మంత్రి సత్యవతి రాథోడ్. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాలని ఓటర్లను అభ్యర్థించారు. మంత్రి సత్యవతితో పాటు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే భాస్కరరావులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

- Advertisement -