ఎప్పుడు ఎదో ఒక వివాదంతో టాలీవుడ్ అట్టుడుకుతూనే ఉంది. ఈసారి రెండు బడా ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు, నందమూరి బాలకృష్ణ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుంది. బాలకృష్ణ గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై చేసిన వ్యాఖ్యలకు నాగబాబు వరుసగా కౌంటర్లు వేస్తున్నారు. ఈవిషయంపై బాలకృష్ణను అడగ్గా ఆయన ఎక్కువగా పట్టించుకోలేదు. తాజాగా నాగబాబు బాలకృష్ణ గురించి ఓ వీడియో ను తెరకెక్కించారు. ఈవీడియోపై నందమూరి అభిమానులు నాగబాబుపై ఫైర్ అవుతున్నారు.
ఎర్రోడి వీరగాధ అని టైటిల్ తో ఈ షార్ట్ ఫిలీంను విడుదల చేశారు. కొందరు ఆడవాళ్లు ఒకవ్యక్తిని కొడుతుంటారు. కారులో వెళుతూ ఆ సీన్ చూసి మన కెందుకులే అని ముందుకు వెళ్లిపోతాడు నాగబాబు. మళ్లీ కొంత ముందుకు వెళ్ళాక మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది. వెంటనే కారు దిగిన నాగబాబు, అతడ్ని ఆడవారి బారినుంచి రక్షించి, నిన్ను ఎందుకు కొడుతున్నారని ఆ వ్యక్తిని అడుగుతాడు.
ఆ వ్యక్తి నేను ఏం తప్పు చేయలేదు సార్ పెద్దలమాట ఫాలో అయ్యాను అంతే అంటాడు. దీంతో ఎంటా మాట అని నాగబాబు అడగ్గా ఆడపిల్ల కనపడితే ముద్దన్నా పెట్టాలి, కడుపన్నాచేయాలి అని పెద్దలు చెప్పిన మాటను ఫాలో అయ్యానంటాడు ఆ వ్యక్తి . దానికి కోపం వచ్చిన నాగబాబు ఆ వ్యక్తిని మళ్లీ మహిళలకు అప్పగించి కారెక్కి వెళ్లి పోతాడు.