ఫిలడెల్ఫియా ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్….

97

తెలంగాణ ఇబ్రహీం పట్నం శాసన సభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అట్టహాసం గా జరిగింది. రెండు వందల మందికి పైగా తెలంగాణ ప్రవాస భారతీయులు తెలంగాణ లోని వివిధ అంశాల పై కూలం కుశంగా చర్చించారు. ఈ సందర్భం గా మంచిరెడ్డి మాట్లాడుతూ NRI లు అందరూ కలిసి విద్య ఉపాధి ప్రతి ఒక్క గ్రామానికి అందేలా చూడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లో వ్యాపార రంగం లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఫార్మా రంగం అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతుందని అందుకు ప్రభుత్వం ౩౩౦౦౦ ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు. దీనికి స్పందిస్తూ ప్రవాస భారతీయులు ప్రముఖ వ్యాపారవేత్త, టాటా అడ్వైసరి చైర్మన్ శ్రీ డా” పైళ్ల మల్లారెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.

Meet and Greet with MLA Manchi Reddy Kishan Reddy

టాటా ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ మహేందర్ రెడ్డి ముసుకు టెలిఫోన్ లో మాట్లాడి టాటా చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరిస్తూ డిజిటల్ స్కూల్స్ అభివృద్ధికి టాటా ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందని ప్రభుత్వం కూడా తగిన శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఇందుకు మంచిరెడ్డి గారు వివరణ ఇస్తూ , మంత్రి వర్యులు శ్రీ KTR గారు ఈ విషయం లో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని, ప్రవాస భారతీయులు రూపాయీ ఇస్తే ఇంకొక రూపాయీ అదనంగా ప్రభుత్వం భరించి మీకు తోడ్పాటు ఇస్తుంద్దని తెలియచేసారు.

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి గంగసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి KCR చేస్తున్న పనులు అభినందనీయమని అయితే రూరల్ గ్రామాలలో డెమానిటైజషన్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని కాబట్టి కేంద్రం తో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్నీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. NATA వైస్ ప్రెసిడెంట్ శ్రీ డా రాఘవ రెడ్డి గోశాల మాట్లాడుతూ మంచిరెడ్డి మృదు స్వభావం కలిగిన శాసన సభ్యులు అని, ఈ మధ్య కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకి ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారిని తీర్చిదిద్దటం, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారికి తన ఖర్చులతో మంచిరెడ్డి చేస్తున్న వివిధ కార్యక్రమాలని కొనియాడారు.

Meet and Greet with MLA Manchi Reddy Kishan Reddy

టాటా బోర్డు అఫ్ డైరెక్టర్ డా రాంరెడ్డి మల్లాది మాట్లాడుతూ.. యువత విషయం లో అశ్రద్ధ చేయకుండా గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్, నగదు రహిత లావాదేవీల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యవహార కర్తలు గా దొంతిరెడ్డి నరసింహ రెడ్డి రమణ రెడ్డి కొత్త మరియు ప్రసాద్ కునారపు తెలంగాణ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఫిలడెల్ఫియా, డెలావేర్, న్యూ జెర్సీ ( గ్రేటర్ డెలావేర్ వాలీ ) , న్యూయార్క్ టాటా ప్రతినిధులు సురేష్ వెంకన్నగారి, వేణు తెలంగాణ, శశి కసిరా, వేణు బత్తిని, శివ రెడ్డి, వంశీ గుళ్ళపల్లి, రమేష్, మల్లిక్ బోళ్ల, మహేష్ దాచేపల్లి అడిగిన వివిధ ప్రశ్నలకి మంచిరెడ్డి సమాధానం ఇచ్చారు.

ఇబ్రహీం పట్నం ప్రవాసాంధ్రులు విలాస్ జంబుల మరియు కిరణ్ గూడూరు మంచిరెడ్డి ని సత్కరించి అభివృద్ధి పనుల గురించి మెమొరాండం సమర్పించారు. శ్రీధర్ గుడాల తో పాటు ఈ కార్యక్రమం లో వివిధ తెలుగు సంఘాలు టాటా, నాట, టీఏజీడీవీ,పీటీఏ, రామ్ నాయకులు మరియు సభ్యులు హరినాద్ , మధు, రవి, రామ మోహన్ , తిరుమల్, సత్య పాల్గొన్నారు.