ఈ మూడు ఆసనాలతో.. ఆ సమస్యలు దూరం!

40
- Advertisement -

నేటి రోజుల్లో చాలమందిని వేదించే సమస్యలలో వేదించే మలబద్దకం ఒకటి. ఈ సమస్య రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. గంటల తరబడి కూర్చొని పని చేయడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మాంసాహారం ఎక్కువగా తినడం, తగినంత నీరు తాగకపోవడం వంటి కారణాలతో చిన్నప్రేగులో కదలికలు తక్కువగా ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్న వారిలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. దాంతో చిన్న పని చేయడానికి కూడా అలసట, బద్దకం ఏర్పడుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఇంకా మలబద్దకం ఉన్న వారిలో తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు వేదిస్తాయి. మలబద్దకం అధికంగా ఉండే పేగు క్యాన్సర్ కు కూడా దారి తీస్తుంది. అందువల్ల మలబద్దక సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు చెబుతున్నారు. అయితే మలబద్దకం సమస్యను తగ్గించడానికి యోగా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. యోగాలోని కొన్ని ఆసనాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అవేంటో తెలుసుకుందాం !

Also Read:IPL 2023: లక్నో గెలుపు

బద్ధ కోనాసనం
ఇది కూర్చొని వేయు ఆసనం. ఈ ఆసనం వేయడం వల్ల ఉదర సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. గ్యాస్, ఉబ్బరం, వంటి సమస్యలను దూరం చేసి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అంతేహ్ కాకుండా ఉదర కండరాలకు బలం చేకూర్చడంలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా తొడల భాగంలోని కొవ్వును కరిగించడంలో కూడా ఈ ఆసనం ప్రముఖ పాత్ర వచిస్తుంది.

మయురాసనం
ఈ ఆసనం కూడా మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం బోర్లా పడుకొని వేయు భంగిమ. రెండు చేతులతో శరీరాన్ని బ్యాలెన్స్ చేయాల్సిఉంటుంది. దాంతో ఉదర కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. తద్వారా మలబద్దకం సమస్య దురమౌతుంది. ఇంకా పొట్ట చుట్టూ కొవ్వు కూడా కరిగిపోతుంది. మోచేతులు, తొడలు, ఛాతీ కండరాలు బలపడతాయి.

Also Read:సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!

గోముఖాసనం
ఈ ఆసనం వేయడం వల్ల మలబద్దక సమస్య దూరం అవడంతో పాటు.. ఇంకా పలు రకాల ప్రయోజనలు కలుగుతాయి. స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముకకు రక్త ప్రసరణ పెరుగుతుంది. తొడ కండరాలు శక్తినొందుతాయి.

ముఖ్యంగా ఈ మూడు ఆసనాలు ప్రతిరోజూ ఉదయం పూట వేయడం వల్ల మలబద్దకం, అజీర్తి, ఉబ్బరం వంటి ఉదర సమస్యలన్నీకూడా తగ్గిపోతాయి.

Also Read:పొట్టి డ్రెస్‌లో బుట్టబొమ్మ

- Advertisement -