ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ వర్షాలపై మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. తన మాటను వక్రీకరించి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వందేళ్ళలో రానంత ఎక్కువగా ఈ సారి వర్షాలు పడ్డాయి… దాంతో నగరంలో వరదలు వచ్చాయని అన్నారు. అంతటి భారీ వర్షాలు. వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటా అనేది నా ఉద్దేశ్యం అని అయితే దాన్ని కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు.
ఇక షేక్ పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందన్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. షేక్ పెట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో తన ప్రమేయం ఏమి లేదని, దీనిపై నేను ఎవరితో మాట్లాడలేదని అన్నారు. బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహారం దాంట్లో నాకు ఎలాంటి పాత్ర లేదని అన్నారు.తహసీల్దార్ కూడా తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు అని మీడియాలో చెప్పారని తెలిపారు.