మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి బాధ్య‌త‌లు..

18
ghmc mayor

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు. మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌య‌ల‌క్ష్మికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నెల 11వ తేదీన మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.