మే 12..అంతర్జాతీయ నర్సింగ్ డే

87
- Advertisement -

వైద్యో నారాయణః హరి అని పెద్దలు అంటారు. అలాంటి వైద్యులు కేవలం రోగితో కొన్ని నిమిషాలు ఉండి వెళ్లిపోతారు. కానీ వైద్యుడి వెంట ఉన్న నర్సు మాత్రం రోగి వెంట 24/7 ఉంటారు. అలాంటి వారి కోసం ఒక రోజు అంటూ ఉంటుంది. అదే మే 12 అంతర్జాతీయ నర్సు దినోత్సవం. నర్సింగ్ వృత్తికి హుందాతనాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి యేటా ఇదో రోజున అంతర్జాతీయ నర్సు దినోత్సవం జరుపుకుంటారు.

గడిచిన మూడేళ్ల కాలంలో ప్రపంచంలో ఎన్నో సంచలనాత్మకమైన మార్పులు సంభవించాయి. కరోనా వల్ల ప్రపంచం అతలాకుతలం అయిన నర్సింగ్ సేవలు చేసిన నర్సులు మాత్రం గుండే ధైర్యం కోల్పోకుండా ప్రజలకు నిరంతరం సేవలు అందించారు. ముఖ్యంగా కరోనా కాలంలో సొంత కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న మేమున్నామంటూ దగ్గరికి వచ్చి సేవలందించారు.

Also Read: మే 16.. దోస్త్ ఆప్లికేషన్‌ షూర్

రోగులకు ఫ్లూయిడ్ అందించడం రెమిడిసివర్ ఇంజక్షన్లు ఆక్సిజన్ మానసిక ధైర్యాన్ని నింపి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాతో చనిపోతున్నా ధైర్యంగా సేవలందించారు. అయితే వీరి సేవలకు తెలంగాణ ప్రభుత్వం నర్సులకు పదోన్నతులు కల్పించింది. నర్సులను నర్సింగ్ ఆఫీసర్లుగా ప్రభుత్వం గుర్తించింది.

Also Read: వైలోప్పిల్లీ…కేరళ సాహిత్యాభ్యుదయ రచయిత

- Advertisement -