లేడీ విత్‌ ది లాంప్…ఫ్లోరెన్స్‌ నైటింగేల్

81
- Advertisement -

నర్సింగ్ సేవలంటే నిరంతరం రోగులతో గడపాల్సి వస్తుంది. వారి బాగోగులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాంటి వారు చేసే సేవలకు ప్రత్యేక గుర్తింపు ఉండదు. కానీ మధ్యయుగ కాలంలో క్రిమియాతో జరుగుతున్న యుద్ధంలో ఒక లేడీ నర్సు సైనికులకు చేస్తున్న సేవలకు మెచ్చుకోకుండా ఉండలేరు. ఆమె పేరు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌.

1820లో ఇటలీలలోని ఫ్లోరెన్స్‌లో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్‌ గౌరవార్థం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆమెను లేడీ విత్‌ ది లాంప్ అని పిలుస్తారు. ఫ్లోరెన్స్ తండ్రి విలియం ఎడ్వర్డ్ నైటింగేల్ మహిళా విద్యకు ఎనలేని కృషి చేశారు. ఫ్లోరెన్స్‌ 1853లో లండన్‌లోని ఇన్‌వాలిడ్‌ జెంటిల్‌వుమెన్ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. తర్వాతి సంవత్సరంలో జరిగిన క్రిమియా యుద్ధంలో సైనికులకు సేవలందించారు.

సైనికులకు మెరుగైన వైద్యం అందించడంలో తనవంతు పాత్ర పోషించారు. అంతేకాదు కొన్నిసార్లు ఉన్నత అధికారులతో ఆమె వాగ్వాదంకు దిగారు. దానికి కారణం సైనికులకు మెరుగైన వైద్యం అందించడంలో అధికారులు సరైన విధంగా స్పందించకపోవడమే అందుకు కారణం. సైనికులు ఎక్కువగా విరేచనాలు జ్వరంతో బాధపడ్డారు. అంతేకాదు క్రిమియన్ జ్వరం కూడా సోకి ఎంతో మందికి సరైన వైద్యం అందలేకపోయింది. అయినా తను ఏమాత్రం చలించకుండా తన వృత్తి ధర్మంను పాటించింది. ఎంతో మంది సైనికులను కాపాడింది.

Also Read: వైలోప్పిల్లీ…కేరళ సాహిత్యాభ్యుదయ రచయిత

1860 జూలై 9న లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లలో నైటింగేల్ శిక్షణా పాఠశాలను ఏర్పాటు చేసింది. అలాగే రాయల్‌ స్టాటిస్టికల్ సొసైటీ సభ్యురాలిగా ఎన్నికైన మొదటి మహిళా మన ఫ్లోరెన్స్‌. ఫ్లోరెన్స్‌ 1907లో ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ని అందుకుంది. 90 సంవత్సరాల వయస్సులో ఆగస్టు13,1910న కన్నుమూసింది. హాంప్‌షైర్లోని ఈస్ట్‌ వెల్లోలోని సెయింట్ మార్గరెట్‌ చర్చిలో ఖననం చేశారు.

Also Read: మే 12..అంతర్జాతీయ నర్సింగ్ డే

- Advertisement -