కుడా ఛైర్మన్‌గా రెండోసారి మర్రి యాదవరెడ్డి

649
- Advertisement -

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) పాలకమండలి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుడా చైర్మెన్ గా మర్రి యాదవ రెడ్డి ని రెండోసారి ప్రభుత్వం నియమించింది. చైర్మన్ తో పాటు 15 మంది డైరెక్టర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

కుడా చైర్మన్‌గా యాదవరెడ్డి పనితీరుపై ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉండడంతో ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. కుడా బోర్డు మెంబర్ల సంఖ్య ఈ సారి పెరిగింది. గతంలో చైర్మన్‌తో పాటు, వైస్‌చైర్మన్‌, మునిసిపల్‌ కమిషనర్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ, రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. ఈసారి ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా బోర్డు సభ్యులుగా నియమించారు. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు.

డైరెక్టర్లుగా మేడిశెట్టి శివశంకర్,దొంతి రవీందర్ రెడ్డి,బుర్రా ఐలయ్య,చిర్ర రాజు గౌడ్,లింగయ్య యాదవ్,మాదెం ప్రవీణ్,యెలుగు శ్రీనివాస్,గులాం సర్వర్‌(మున్నా),యుకంటి వనం రెడ్డి,నన్నేబోయిన రమేష్ యాదవ్,భుక్యా శంకర్ నాయక్,బిల్లా యాదగిరి,అనుకుతాళ్ల రవీందర్,వీరగొని రాజ్‌కుమార్ నియమితులయ్యారు.

kuda kuda

- Advertisement -