గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కుడా చైర్మన్..

22

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరుఊరికో జమ్మి చెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి భద్రకాళి బండ్ దగ్గర కుడా అధికారులతో కలిసి జమ్మి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఛాలెంజ్‌లో జమ్మి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో తెలంగాణలోనే కాకుండా దేశంలో కూడా ప్రముఖుల చేత మొక్కలు నాటిస్తున్నారు ఇది చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఇందులో బాగంగా ఈరోజు జమ్మి మొక్కలు నాటడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.