ప్రతి రోజు పండగే టైటిల్ సాంగ్..

668
sai tej
- Advertisement -

చిత్రలహరి మూవీతో హిట్ కొట్టిన సుప్రీం హీరో సాయి తేజ్ మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘పది మంది ఉండగా ప్రతి రోజు పండగే..పడి నవ్వుతుండగా ప్రతి రోజు పండగే’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. అంతా ఉమ్మడిగా కలిసుంటే ప్రతీ రోజూ పండగలా ఉంటుందనే సందేశంతో ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

- Advertisement -