కోవిడ్ 19 నియంత్రణకు లాక్ డౌన్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రతి నిరుపేద పస్తులు ఉండొద్దని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. 90 శాతం మంది లబ్ధిదారులు రేషన్ షాప్ లలో రేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే లబ్ధిదారులకు 1500 రూపాయలు నగదు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
రేషన్ కార్డ్ లబ్ధిదారులకు మాత్రమే ఖాతాలో డబ్బు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే చాలా వరకు డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది నా దృష్టికి వచ్చింది. ఖాతాలో జమ అయిన నగదు తీసుకోక పోతే ఖాతా నుండి పోతాయి అని ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తి అవాస్తవం మీ డబ్బులు ఎక్కడికి పోవు అని తెలిపారు.
మీరు అనవసరంగా బ్యాంక్ ల దగ్గర గుమికుడొద్దు దయచేసి మీ డబ్బులు ఎక్కడకు పోవు మీ ఖాతాలోనే ఉంటాయి. తప్పుడు ప్రచారం నమ్మవద్దని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్యాంక్ ల దగ్గర గుమికుడి కరోన వైరస్ కు గురికావద్దు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలన్నారు..