ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం నేటితో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకున్నది. మనీలాలోని టోండోలో ఇవాళ తెల్లవారుజామున 1.29నిమిషాలకు ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు వినీస్ మబాన్సాగ్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో 8వ బిలియన్ వ్యక్తి పుట్టినట్లు పిలిప్పీన్స్కు చెందిన జనాభా, అభివృద్ధి సంఘం పేర్కొన్నది.
డాక్టర్ జోస్ ఫాబెల్లా మెమోరియల్ ఆసుపత్రిలో ఈ పుట్టిన పాపతో ప్రపంచ జనాభా 800కోట్ల మార్కును దాటిందని ఐరాస ఒక ప్రకటనలో తెలిపింది. ఆ పాపకు చెందిన ఫోటోలను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ప్రపంచ జనాభాకు వంద కోట్ల మంది కొత్తగా జత కావడానికి 12 ఏళ్లు పట్టినట్లు ఆ పేజీలో తెలిపారు. ఇక వచ్చే ఏడాది అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో చైనాను ఇండియా దాటివేయనున్నట్లు పేర్కొన్నది.
LOOK: Meet baby girl Vinice Mabansag—isa sa sumisimbolo bilang ika-8 bilyong tao sa mundo. Ipinanganak siya sa Dr. Jose Fabella Memorial Hospital kaninang 1:29am. | @gmanews pic.twitter.com/RQE0NSZCjm
— Nico Waje (@nicowaje) November 14, 2022
ఇవి కూడా చదవండి..
ఓ శకం ముగిసింది..తరతరాలకు ఆదర్శం వీరు!
కృష్ణ పార్థీవ దేహంకు నివాళులు ఆర్పించిన సీఎం
తెలంగాణకు నేడు విశిష్టమైన దినం:కేటీఆర్