ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది..

211
Manikya Malaraya Poovi Song Video
- Advertisement -

మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. గత రెండు రోజుగా ఆమె నటించిన ఓరు ఆదార్ లవ్‌లోని మానిక్యా మలారాయ పూవి అనేసాంగ్ క్లిప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌గా మారింది. 26 సెకండ్ల పాటు ఉన్న ఉన్న ఈ వీడియో క్లిప్‌లో ప్రియా పలికించిన రకరకాల హావభావాలకు ప్రేక్షకులు మంత్రముగ్దులైపోయారు.

https://twitter.com/iamsouvikpaul/status/962554679237345282

ఎంతలా అంటే.. కుర్రకారు కొన్ని వందలు, వేల సార్లు ఆ వీడియోను చూస్తూ ముగ్ధులైపోతున్నారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. ఎక్కడ చూసినా ఆ వీడియోనే. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో కుర్రకాళ్లు మతులు పోగొడుతోంది. ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 46 లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోపై కూడా ఓ లుక్కేయండి ..

- Advertisement -