ట్రాఫిక్‌లో చిక్కుకున్న విష్ణు-సురభి..!

235
Manchu Vishnu-Surabhi In New Film
- Advertisement -

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్ లో లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. సదరు సన్నివేశం ట్రాఫిక్ జామ్ లో చిత్రీకరించి ఉండాల్సి రావడంతో పెద్ద సంఖ్యలో వెహికిల్స్ ను ఏర్పాటు చేశారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపటితో రెండోభారీ షెడ్యూల్ పూర్తికానుంది.

Manchu Vishnu-Surabhi In New Film

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. “నేడు రామోజీ ఫిలిమ్ సిటీలో వేయబడిన ప్రత్యేకమైన సెట్ లో హీరోహీరోయిన్ల నడుమ లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నాం. అలాగే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపాం. మంచు విష్ణుకి కథానాయకుడిగా మంచి పేరు తీసుకురావడంతోపాటు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో బైలింగువల్ సినిమాగా రూపొందిస్తున్నాం. దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్ తో మా యూనిట్ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమన్ నేతృత్వంలో పాటల కంపోజింగ్ కూడా జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాం” అన్నారు.

సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్!!

- Advertisement -