రకుల్‌ అస్సలు ఆగట్లేదు…!

211
Rakul Preet on Diet & Beauty
- Advertisement -

టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది ఈ బ్యూటీ.  సినిమా సినిమాకీ తన గ్లామర్‌ పెంచుతూ .. కొత్త కొత్తగా ముస్తాబవుతున్న రకుల్ తన ఫిజిక్‌ని కాపాడుకోవడానికి జమ్‌లో గంటల తరబడి సాధన చేస్తుందట. అలాగని తిండి విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్‌ పెట్టుకోలేదట. ఇక ఆదివారం వస్తే రకుల్‌ని ఆపడం ఎవరితరం కాదంట. ఈ విషయాన్ని రకులే స్వయంగా వెల్లడించింది.

తాను మంచి  భోజన ప్రియురాలినని …. తన ముందు రకరకాల వంటకాలు పెట్టాల్సిందే. అన్నింటినీ కొంచెం కొంచెం రుచి చూడాల్సిందేనని తేల్చిచెప్పింది. లేకంటే తనకు భోజనం చేసినట్టే ఉండదట. వారమంతా సెట్లోనే ఉంటానని అక్కడ ఏం పెడితే అది తింటాను. షూటింగ్‌ ఉన్నప్పుడు నా డైట్‌ పూర్తిగా నా అధీనంలోనే ఉంటుందని వెల్లడించింది.

అయితే ఆదివారం మాత్రం తనని ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేస్తోంది ఈ పంజాబి బ్యూటీ. దగ్గర్లో మంచి రెస్టారెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో శనివారం నుంచే జల్లెడ పడతానని  అక్కడ బఫేలో కనీసం వంద ఐటెమ్స్‌ అయినా ఉండాల్సిందేనని తెలిపింది. అయితే, ఎంత తిన్నా జిమ్ చేయడం మాత్రం తప్పనిసరి చెబుతోంది రకుల్.

ఇక టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ అవసరమైతే పాత్ర డిమాండ్ చేస్తూ న్యూడ్‌గా నటించేందుకు కూడా సిద్ధమంటోందట. క్యారెక్టర్ కోసం న్యూడ్ గా కనిపించేందుకు సైతం రెడీగా ఉన్నానంటూ తనను కలిసి ఓ దర్శకుడికి చెప్పిందట ఈ పంజాబీ బ్యూటీ.

- Advertisement -