వెబ్ సిరీస్ గా ఎన్టీఆర్ బయోపిక్!

267
Vishnu Manchu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించిన ఈమూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ప్లాప్ ను మూటగట్టుకుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కూడా అంతాగా ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఒక వెబ్ సరీస్ ను నిర్మిస్తున్నాడు.

ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల నేపథ్యంలో నిర్మితమవుతున్న కారణంగా ‘చదరంగం’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ఎన్టీఆర్ ను దగ్గర నుంచి చూసిన వ్యక్తి మోహన్ బాబు ఈ వెబ్ సిరీస్ కు సహాకారాన్ని అందిస్తున్నారని టాక్. రాజ్ అనంత ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీ రామారావు పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5లో కొద్దీ రోజుల్లోనే ఈ సిరీస్ ప్రసారం కానుంది.