మరో పెళ్లికి సిద్దమైన టాలీవుడ్ హీరో

400
manchu manoj
- Advertisement -

హీరో మంచు మనోజ్ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక మంచు మనోజ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. నేను త్వరలోనే ఫైర్ బాల్ లా మీ ముందుకు వస్తున్నా. వారం రోజుల్లో ఓ ఆసక్తికరమైన విషయం మీతో పంచుకుంటా..వెయిట్ చెయ్యండి అంటూ ట్వీట్ చేశారు మంచు మనోజ్.

దీంతో మనోజ్ చేసిన ట్వీట్ కు కొంత మంది ఆల్ ది బెస్ట్ చెప్పగా మరికొంత మంది పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించారు మనోజ్. మరో పెళ్లి చేసుకుంటున్నారా? అని అభిమాని అడగ్గా..వామ్మో అని మెసెజ్ చేశారు మనోజ్. కాగా మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా 2015లో ప్రణితను వివాహం చేసుకున్న మనోజ్ ఇటివలే విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ ను స్ధాపించి సినిమాలను నిర్మించే పనిలో ఉన్నాడు మనోజ్.

mm

manoj

- Advertisement -