అర్ధరాత్రి మంచు మనోజ్ హైడ్రామా..

14
- Advertisement -

అర్థరాత్రి నటుడు మంచు మనోజ్ హైడ్రామా చేశారు. బాకారాపేట సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో బస చేశారు మంచు మనోజ్. పెట్రోలింగ్‌లో ఉన్న ఎస్ఐ.. మనోజ్ బౌన్సర్లను విచారించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మనోజ్.

అంతేగాదు రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు బాకారాపేట పీఎస్ మెట్ల వద్ద కూర్చోని ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత సీఐ వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇక ఇప్పటికే మంచు ఫ్యామిలీలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ విష్ణు, మోహన్ బాబు మధ్య మాటల యుద్ధమే కాదు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లిన సంగతి తెలిసిందే.

Also Read:నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి

- Advertisement -