మోదీ బాటలో రజనీకాంత్

253
rajinikanth Man Vs Wild

డిస్కవరి ఛానల్ లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో ఆమధ్య ప్రధాని మోదీ కనిపించిన సంగతి తెలిసిందే. బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ చేసిన సాహాసాలు చేశారు. ఉత్తారాఖండ్ లోని జిమ్ కార్బెట్ అటవీ ప్రాంతంలో వీరిద్దరు తిరిగారు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా 180కి దేశాల్లో డిస్కవరి ఛానల్లో ఈకార్యక్రమం ప్రసారమైంది.

కాగా సూపర్ స్టార్ రజినికాంత్ కూడా డిస్కవరి ఛానల్ లో కనిపించనున్నాడు. క‌ర్నాట‌క‌లోని బందిపుర్ అడ‌వుల్లో ఈ షూటింగ్ జ‌రుగుతున్న‌ది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు మ్యాన్ వర్సెస్ వైల్డ్ కోసం షూటింగ్ నిర్వహించనున్నారు. బేర్ గ్రీల్స్ తో పాటు రజనీకాంత్ కర్ణాటకలోని టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో తిరగనున్నారు. సుమారు ఆరు గంటలు వీరిద్దరు కలిసి అడవిలో గడపనున్నారు.