జక్కన్న దర్శకత్వంలో ఝాన్సీ లక్ష్మీగా…!

250
- Advertisement -

మంచు లక్ష్మి….. టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. మోహన్ బాబు కూతురిగా సినీ రంగానికి పరిచయమైనా. తనైదన స్టైల్, ఆటిట్యూడ్, ఫ్యాషన్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు నటిగా, నిర్మాతగా వెండి తెరపై… వినూత్నమైన టీవీషోల ద్వారా బుల్లి తెరపై రాణిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

online news portal

తెలుగులో ‘లక్ష్మీ టాక్‌ షో’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె…. ‘ప్రేమతో మీ లక్ష్మి’ లాంటి షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహించిన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం మంత్రగత్తె ‘ఐరేంద్రి’గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల బాహుబలి సినిమాలో శివగామి పాత్రను రిజెక్ట్ చేశాను చెప్పిన సంగతి విధితమే.. కాగా ఇప్పుడు మంచు లక్ష్మి మరో సారి తన కలను బయట పెట్టింది…. తనకు ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటించాలని ఉన్నదని చెప్పింది.. అంతేకాదు.. ఆ సినిమాకు దర్శకత్వం జక్కన్న రాజమౌళి వహిస్తే చాలా అద్భుతంగా ఉంటుందని తన మనసులో మాట చెప్పింది… మరి లక్ష్మి కోరిక విన్న రాజమౌళి ఎలా స్పందిస్తాడో.. చూడాలి మరి

online news portal

ఇక గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భ‌వ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం `లక్ష్మీ బాంబ్’. ఫ్రమ్ శివకాశి అనేది చిత్ర ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మించారు. మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మంచు ల‌క్ష్మీ చేయ‌ని ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఆమెను ద‌ర్శ‌కుడు ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -