మంచు లక్ష్మి బాస్మతి బ్లూస్

438
manchu laxmi
- Advertisement -

తెలుగు నటి, నిర్మాత మంచు లక్ష్మి గతంలో అమెరికాలో ఉన్నపుడు పలు హాలీవుడ్ చిత్రాల్లో, టీవీ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇండియాకి వచ్చి సెటిలైన తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయారు. చాలా కాలం తర్వాత మంచు లక్ష్మి మళ్లీ ఓ హాలీవుడ్ చిత్రంలో నటించింది. హాలీవుడ్లో ‘బాస్మతి బ్లూస్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఇండియాలో పండించే వరి ధాన్యం కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది.

manchu laxmi_basmati-blues

ఈ మూవీలో త‌న పాత్ర ఎలాంటిదో వివ‌రించింది మంచువార‌మ్మాయి. ఓ ఇంట‌ర్వ్యూలో తన రోల్ గురించి చెబుతూ.. ఇండియ‌న్ విలేజ్ గార్ల్ సీతగా, హీరోకి సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్‌లో తాను క‌నిపించ‌నున్న‌ట్టు చెప్పుకొచ్చింది. ఆస్కార్ విన్న‌ర్‌ బ్రీ లార్సన్, అంబుద్కర్, స్కాట్ బక్కుల‌, డొనాల్డ్ సూత‌ర్‌లాండ్‌ వంటి హాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొంది మంచు ల‌క్ష్మీ. డాన్ బారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ భాష‌లోను విడుద‌ల కానుంది.

- Advertisement -