నాది ఆ క్యారెక్ట‌ర్ కాదు…

268
anchor anasuya
- Advertisement -

 అనసూయ అంటే మన తెలుగు రాష్టాలలో తెలియని వారు ఎవ‌రూ లేరు. ఈ ముద్దుగుమ్మ బుల్లి తెరమీద ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. ఓ టీవీలో ప్రసారమైన జబర్దస్ కామెడీ షోతో మరింత పాపులర్‌గా మారింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ ఇటీవల  వెండితెరపై కూడా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.  ముఖ్యంగా కుర్రకారు అనసూయ అందాలకు చాలా వరకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా వరకు పెరిగిపోతోంది.

anchor anasuya

అయితే అసలు విష‌యానికి వ‌స్తే..  అనసూయ.. తనకు సమయం దొరికినప్పుడల్లా.. ట్విట్టర్‌లో లైవ్ చాట్ నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా అనసూయ ట్విట్టర్‌లో లైవ్ చాట్ నిర్వహించారు. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన తరహాలో సమాధానం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె నటిస్తున్న రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన పాత్ర గురించి రకరకాలుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అత్తగా అనసూయ నటిస్తుందని వార్తలు వ్యాపించడమే కాదు, దాదాపు అందరూ ఇదే నిజమనుకుంటున్నారు.

anchor anasuya

ఇదే ప్రశ్నను ఓ ఫాలోయర్ ఆమెను అడిగాడు. ఇది ఫాల్స్ న్యూస్ అంటూ తేల్చి పారేసి.. అలాంటి పాత్రలో తాను నటిస్తున్నాననే రూమర్స్ ను ఖండించేసింది అనసూయ. గతంలో కూడా ఇదే మాటను ఇన్ డైరెక్టుగా చెప్పినా జనాలు మళ్లీ మళ్లీ అడుగుతుండడంతో.. ఈసారి ఖరాఖండీగా తేల్చేసింది అనసూయ. ఇక సుకుమార్ దర్శకత్వంలో నటించడం కూడా ఆనందంగా ఉందని.. ఇండస్ట్రీలోకి తాను అడుగు పెట్టకముందునుంచే ఆయన తన పేవరేట్ డైరెక్టర్ అంటోంది అందాల అనసూయ.

- Advertisement -