- Advertisement -
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియాలో పని చేస్తున్న నారాయణరెడ్డి(53) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన చనిపోయాడనే సమాచారం కూడా కుటుంబ సభ్యులకు చేరవేయకుండా స్టూడియో సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించడంతో… ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతుడి శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయని… ఎవరో హత్య చేసి ఉంటారని ఆయన కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట మృతిడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
నిత్యం షూటింగ్ లతో రద్దీగా ఉండే అన్నపూర్ణ స్టూడియో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కలకలం రేగింది. ఇక ఎవరైనా హత్య చేశారా.. లేక సూసైడ్ చేసుకున్నాడా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -