చిరు- నాగ్‌తో మంత్రి తలసాని భేటీ..

430
- Advertisement -

ఈ రోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో భేటీ అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న పలు సమస్యలు, పరిష్కారాలు, అభివృద్ధి తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించించారు మంత్రి. హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో ఈ సమావేశం జరిగింది.

Minister Talasani

ఈ విషయాన్ని సౌత్ ఇండియన్ మూవీస్ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే సమావేశం వివరాలను మంత్రి వెల్లడించలేదని, మరోసారి భేటీ అయిన తర్వాత అన్ని వివరాలను ప్రెస్ మీట్లో తెలియజేస్తామని మంత్రి చెప్పారని ఆయన తెలిపారు.

- Advertisement -