బోనాల జాతర పోస్టర్‌ ఆవిష్కరించిన ఎంపీ కవిత

252
tauk mp kavitha

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 15 న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో టాక్ సంస్థ ప్రతినిధులు శ్రీమతి శ్వేతా రెడ్డి, జాహ్ణవి , మల్లేష్ పప్పుల, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, విజయ్ కోరబోయిన,రోహిత్ రావు, పసుల చరణ్ తదితరులు పాల్గొన్నారు.

టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత గారికి టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ప్రత్యేక కృతఙతలు తెలిపారు. ఎంపీ కవిత గారితో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని మీడియాకి తెలిపారు. యూకే లో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఇతర వివరాలకు www.tauk.org.uk వెబ్ సైట్ ని సంప్రదించమని తెలిపారు.