అన్నపూర్ణ స్టూడియోలో SSMB28

58
ssmb28
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్‌ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఇందుకోసం ఓ ప్రత్యేక సెట్‌ని ఏర్పాటు చేయగా ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరించనున్నట్లు సమాచారం.

అలాగే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కూడా భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ , సాంగ్స్ షూట్ చేస్తారని టాక్. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా 2023 ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -