పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో టీఎంసీ పార్టీ ..పానిక్ మోడ్‌లో ఉంది అని పేర్కొన్నారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజా మద్దతు కారణంగా టీఎంసీ ఆందోళన చెందుతోందని అన్నారు.
పూర్బ బర్ధమాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చట్టసువ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. మహిళల భద్రతకు పూర్తి హామీ ఇస్తామని, రాజకీయ హింసలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అదే సమయంలో, అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన చొరబాటుదారులను బయటకు పంపిస్తామని తెలిపారు. వారికి సహకరించిన వారిపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలే అక్రమ చొరబాటును వ్యతిరేకిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అవినీతి, చట్టవ్యవస్థపై వైట్ పేపర్ విడుదల చేస్తామని, టీఎంసీకి చెందిన గూండాలు, సిండికేట్లు, అవినీతి నాయకులను చట్టపరంగా బాధ్యత వహించేలా చేస్తామని మోదీ పేర్కొన్నారు. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ALso Read:బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు
సిండికేట్ వ్యవస్థ స్థానంలో పారదర్శక టెండర్ విధానం తీసుకువస్తాం. ఇసుక మైనింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం అని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు.

