వైభవ్..టీమిండియా డెబ్యూకి రెడీ!

9
- Advertisement -

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న ఈ యువకుడు, వరుసగా తన ప్రతిభను నిరూపిస్తూ టీమ్ ఇండియాలో చోటు సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాడు.

ఇటీవల ఆర్సీబీ పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉండటం విశేషం. అనుభవజ్ఞులైన భువనేశ్వర్, హాజల్ వుడ్‌ ,కృనాల్ పాండ్యా లాంటి బౌలర్లను కూడా సులభంగా ఎదుర్కొన్నాడు.

ఈ ప్రదర్శనను ప్రశంసిస్తూ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్…, వైభవ్ భారత జట్టుకు అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసే ఆటగాడిగా నిలవాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్.. 16 సంవత్సరాలు 205 రోజుల్లో భారత్ తరఫున డెబ్యూ చేసిన అతి చిన్న వయస్కుడిగా ఉన్నారు. వైభవ్ ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశముందని చర్చ జరుగుతోంది.

మార్చి 2026లో 15 ఏళ్లు పూర్తిచేసుకున్న వైభవ్, అప్పటి నుంచి సీనియర్ జట్టుకు అర్హత పొందాడు. అండర్-19 స్థాయిలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రాణించిన ఈ యువ ఆటగాడు, వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 175 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో వైభవ్ 4 మ్యాచ్‌ల్లో 200 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇందులో రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. ఆర్సీబీపై ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

Also Read:బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు

- Advertisement -