బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు

11
- Advertisement -

మహమ్మద్ బాగీర్ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకున్న సందర్భంగా ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది. మినాబ్ స్కూల్‌పై జరిగిన దాడిలో మరణించిన చిన్నారులను గుర్తుచేసేలా, వారి ఫోటోలను విమానంలోని ఖాళీ సీట్లపై ఉంచి ప్రయాణించారు.

ఈ మినాబ్ స్కూల్ దాడి యుఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభ దశలో జరిగింది. ఈ ఘటనలో కనీసం 168 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఈ దాడి సమీపంలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిందని చెప్పగా, ఇరాన్ మాత్రం ఇది ముందే పన్నుకున్న దాడి అని ఆరోపించింది.

విమానంలో తీసిన ఫోటోను బాగీర్ సోషల్ మీడియా వేదిక X (మునుపటి ట్విట్టర్) లో షేర్ చేస్తూ, “నా సహ ప్రయాణికులు – Minab168” అని పేర్కొన్నారు.
ఇరాన్ తరువాత ఈ దాడికి బాధ్యులని చెబుతూ, అమెరికా నేవీకి చెందిన అధికారులైన Leigh R. Tate, Jeffrey E. York ఫోటోలను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్..అమెరికా వద్ద కూడా ప్రస్తావించగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది.

పాకిస్తాన్‌లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలకు గలిబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చర్చల ఫలితాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అయితే, అమెరికాతో చర్చలపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. మా ఉద్దేశాలు మంచివే, కానీ అమెరికాపై మాకు నమ్మకం లేదు. గతంలో చర్చలు ఎప్పుడూ విఫలమయ్యాయి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అని గలిబాఫ్ వ్యాఖ్యానించారు.

ALso Read:ఆర్సీబీపై రాజస్థాన్‌ ఘన విజయం

ఇరాన్ లెబనాన్‌లో కాల్పుల విరమణతో పాటు, తన ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఒప్పందం నుంచి తప్పుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు, అమెరికా మాత్రం ఇరాన్‌ను హెచ్చరిస్తూ, పరిస్థితిని తేలికగా తీసుకోవద్దని, అవసరమైతే మరిన్ని దాడులు జరిపే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -