గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన మల్లాపూర్ కార్పోరేటర్..

26

ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దేవేందర్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు బోంతు శ్రీదేవి యాదవ్, స్వర్ణరాజ్,మాజీ కార్పోరేటర్ గొల్లురి అంజయ్య తదితరులు పాల్గోన్నారు.