మల్లాన్నసాగర్ వెట్ రన్ విజయవంతం..

36
Mallanna Sagar Surge Pool Wet Run Successful

సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్‌ సర్జ్‌పూల్‌ మోటార్‌ ట్రయల్‌ రన్‌ ఈ రోజు నిర్వహించారు. మల్లాన్నసాగర్ వెట్ రన్‌లో భాగంగా 8 మోటర్లలో 1 మోటర్‌ను ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ హరే రామ్ ఈసీ లు ఆనంద్,వేణు పలువురు అధికారులు పాల్గొన్నారు.

మల్లన్న సాగర్ సర్జిపూల్ నుండి డిస్టిబ్యూషన్ సెంటర్ నుండి పైప్‌ల ద్వారా ఉబికి వచ్చిన గోదావరి నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా కొండపోచమ్మ సాగర్ వైపు పరుగులు పెడుతోంది. రెండు రోజుల్లో అక్కారం సర్జిపూల్‌కు గోదావరి జలాలు చేరనున్నాయి.

తోగుట మండలం తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడం జిల్లా ప్రజల్లో ఆనందాన్ని నింపాయి. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న మల్లన్న సాగర్‌ ట్రయల్‌ రన్‌‌ విజయవంతం కావడంతో రైతుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.