BCCI:మహిళ క్రికెటర్లకు గ్రేడ్స్ ప్రకటన..

47
- Advertisement -

బీసీసీఐ తాజాగా కీలక ప్రకటనను విడుదల చేసింది. 2022-2023 సీజన్ కోసం మహిళల జట్టు సభ్యులను వార్షిక వేతనంను ప్రకటించింది. ఇందులో మొత్తంగా 3గ్రేడ్‌లు ఉన్నాయి. ఇందులో కేవలం ఏగ్రేడ్‌కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్‌ కెప్టెన్ స్మృతి మంధాన, దీప్తి శర్మలు ఉన్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్న వారికి గతేడాది వార్షిక వేతనంగా రూ.50లక్షలు నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఆ మొత్తాలను పెంచే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

బీ గ్రేడ్‌లో ఐదుగురికి చోటు దక్కింది. రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్ గ్రేడ్ బి విభాగంలో చోటు దక్కించుకున్నారు. వీరికి గతేడాది రూ. 30లక్షలుగా ఉంది.

సీ గ్రేడ్‌లో తొమ్మిది మంది ఎంపికయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి అంజలి సర్వాణి సబ్బినేని మేఘన ఎంపికయ్యారు. ఇందులో మొత్తంగా మేఘనా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, మరియు యాస్తికా భాటియా గ్రేడ్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. వీరికి గతేడాది రూ.10లక్షల వార్షిక వేతనంను ఇవ్వనున్నారు.

Also Read: IPL 2023:చెన్నై జోరు.. రాజస్తాన్ నిలిచేనా!

గతేడాది బీసీసీఐ కార్యదర్శి జైషా లింగ సమానత్వం కోసం మహిళలకు కూడా పురుష జట్టుకు సమానంగా మ్యాచ్‌ ఫీజులను చెల్లించనుంది. టెస్ట్ మ్యాచ్‌లకు రూ.15లక్షలు, వన్డే మ్యాచ్‌లకు రూ.6లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.3లక్షలు మ్యాచ్‌ ఫీజు చెల్లించనుంది.

Also Read: Rahane:టెస్టు జట్టులోకి ఎంట్రీ

- Advertisement -