పృధ్వీరాజ్ ప్లేస్ లో కార్తీక్ ఆర్యన్

648
- Advertisement -

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ నటిస్తున్నాడని, దర్శకుడు త్రివిక్రమ్.. పృధ్వీరాజ్ కోసం మంచి క్యారెక్టర్ రాశాడని వార్తలు వినిపించాయి. అయితే, పృధ్వీరాజ్ ఇటు నిర్మాతగా, దర్శకుడిగా, పైగా హీరోగా చాలా బిజీగా ఉన్నాడు. మరోపక్క మహేష్ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పృధ్వీరాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ పాత్ర కోసం మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది.

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ఓ రూమర్ వైరల్ అవుతుంది. నిజంగా మహేష్ సినిమాలో కార్తీక్ ఆర్యన్ నటిస్తే..ఇక ఆ సినిమా రేంజ్ ఓ లెవెల్లో వుంటుంది. ప్రస్తుతం ఈ ఫీట్ ను పాజిబుల్ చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒకటే సమస్య. మహేష్ బాబు – కార్తీక్ ఆర్యన్ పాత్రలు ఎక్కడా తగ్గకూడడు. పైగా ఏ ఒక్కరికీ ప్రాధాన్యత ఇవ్వకూడదు. అప్పుడే ఈ కాంబినేషన్ పై కిక్ ఉంటుంది. త్రివిక్రమ్ డైరక్షన్ లో మహేష్ సినిమా వచ్చే నెలలో భారీ షెడ్యూల్ తో భారీగా స్టార్ట్ కానుంది. ఈ లోపే కార్తీక్ ఆర్యన్ పై క్లారిటీ రానుంది.

త్రివిక్రమ్ రాసుకున్న కథలో మహేష్ బాబుతో పాటు సమానమైన మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంది. ఆ పాత్ర కోసమే కార్తీక్ ఆర్యన్ ను తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ కూడా ఈ పాత్ర చేయడానికి సిద్దంగానే ఉండే అవకాశం ఉంది. కానీ సమస్య ఒకటే. ఇక్కడ మహేష్ సినిమా షెడ్యూలు ప్లానింగ్ తో అక్కడ కార్తీక్ ఆర్యన్ డేట్ లు మ్యాచ్ కావాలి. మొత్తానికి కార్తీక్ ఆర్యన్ నటిస్తే.. హిందీలో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. కాకపోతే, టాప్ హీరోలను ఓ ఫ్రేమ్ లోకి తీసుకురావడం, అలాగే ఇద్దర్నీ బ్యాలెన్స్ చేయడం కష్టమే. మరి త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

బాలకృష్ణతో డ్యాన్స్‌ నాఅదృష్టం: చంద్రిక

లేడీ నిర్మాతతో కుర్ర హీరో పెళ్లి?

ప్చ్.. బాలయ్య ఏం చేస్తాడో ?

- Advertisement -